TOLLYWOOD

ప్రతి సినిమా దీపికతోనే షురూ

[ad_1]

థింక్ బిగ్ అన్నారు పెద్దలు. ఆ మాటని  అక్షరాలా పాటిస్తుంటారు మన సినిమా నిర్మాతలు. ప్రభాస్ ఏ కొత్త సినిమా ప్రకటించినా మొదట పరిశీలంచే హీరోయిన్ పేరు, అభిమానులు ప్రచారం చేసే నేమ్ …దీపిక పదుకొను. బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న దీపిక పేరు ఇప్పుడు మళ్లీ మారుమ్రోగుతోంది. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందే సినిమాకి దీపికాని తీసుకోవాలని అటు అభిమానులు అడుగుతున్నారు, ఇటు నిర్మాతలు కూడా ఇదే మాట అంటున్నారు. 

కానీ దీపిక ఒప్పుకుంటుందా? ఆమెని “బాహుబలి” సినిమాల్లోనూ తీసుకోవాలనుకున్నారు. “ప్రభాస్ 20” సినిమాకి కూడా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దీపిక ప్రస్తుతం బాలీవుడ్ లో  కూడా ఆమె సినిమాలు తగ్గించింది. తన గురువు భన్సాలీ సినిమాలు మినహా పెద్దగా సినిమాలు సైన్ చెయ్యడం లేదు. 

మరి నాగ్ అశ్విన్ సినిమాలో ఆమె నటిస్తుందా?

[ad_2]

Source link

Leave a Reply