TOLLYWOOD

అక్షర అందాల కనువిందు

[ad_1]

కొంతమందికి ఒంటి నిండా అందం ఉంటుంది. కాస్తోకూస్తో యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంటుంది. కానీ అదృష్టమే ఆవగింజ అంత ఉంటుంది. అందుకే ఎంత అందమున్నా, దాన్ని వెండితెర నిండా పరవలేరు. తప్పని పరిస్థితుల్లో సోషల్ మీడియాకే పరిమితం అవుతుంటారు. ఈ కేటగిరిలో ఓ నేహాశర్మను, ఇంకాస్త ముందుకెళ్తే అక్షర గౌడను చెప్పుకోవచ్చు

మంచి మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ కన్నడ పిల్లకు ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలో స్టార్ డమ్ దక్కలేదు. తమిళ, హిందీ, కన్నడ సినిమాలు చేసిన ఈ అమ్మాయి ఎక్కడా క్లిక్ అవ్వలేకపోయింది. నాగార్జున నటించిన మన్మథుడు-2లో ఓ చిన్న పాత్ర కూడా పోషించి, తెలుగుతెరపై కూడా అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అక్షర అందాలు అరకొరగానే ప్రేక్షకులకు గుర్తున్నాయి.

Also Check: Akshara Gowda Glam Pics

దీంతో ఈమె ఇప్పుడు పూర్తిగా ఫొటోషూట్లు, సోషల్ మీడియానే నమ్ముకుంది. ఓవైపు వచ్చిన సినిమాల్ని ఒప్పుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో తన ఒంపుసొంపుల్ని చూపిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది. కనీసం ఈ హాట్ ఫొటోలైనా ఈమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి. ప్రస్తుతం ఈమె ఓ కన్నడ, ఓ తమిళ సినిమాలో చిన్న రోల్స్ పోషిస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply