BOLLYWOOD

ఆ హాట్ బ్యూటీ బయటకు వెళితే లక్షల్లో ఖర్చు.. కుర్ర హీరో దగ్గర గట్టిగానే లాగుతోందట!

[ad_1]

హాట్ బ్యూటీ..

మలైకా అరోరా చాలా ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వయసు ఎంత పెరిగినా కూడా ఇంకా తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూనే ఉంటోంది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ తో నిత్యం వైరల్ అయ్యేలా ప్రవర్తిస్తుంది. కెవ్వుకేక సాంగ్ తో టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కూడా హాట్ స్టెప్పులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించేసి తనకు నచ్చినట్లుగా జీవిస్తోంది.

కుర్ర హీరోతో ప్రేమాయణం

కుర్ర హీరోతో ప్రేమాయణం

మలైకా అరోరా గురించి అందరికి తెలిసే ఉంటుంది. వయసు 46. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత విడాకులు తీసుకుంది. తనకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం తన కంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా అతనితో ఎఫైర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఆలోచనలపై ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు.

బయటకు వెళితే లక్షల్లో ఖర్చు..

బయటకు వెళితే లక్షల్లో ఖర్చు..

మలైకా అరోరా ఎక్కడికెళ్లినా చాలా కాస్ట్లీ లైఫ్ ని మెయింటైన్ చేస్తుంది. ఆమె బయటకు వెళితే దాదాపు 3లక్షలు వరకు ఖర్చులు ఉంటాయట. ఎక్కువగా ఈ బ్యూటీకి హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం. విదేశాలకు వెళ్లినప్పుడు కనీసం నాలుగైదు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురాకపోతే మలైకా హ్యాపీగా ఉండలేదట. వాటి విలువ ఒక్కోటి రూ.2లక్షలకు తక్కువ ఉండదట. ఇక కుదిరిన ప్రతిసారి ఇష్టం వచ్చిన దేశానికి వెళుతూ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడంలో కూడా మలైకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

 ప్రియుడి నుంచి ఖరీదైన బహుమతులు..

ప్రియుడి నుంచి ఖరీదైన బహుమతులు..

మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా తన ప్రియురాలి కోసం ఖరీదైన బహుమతులు కొనడంలో ముందుంటాడట. ఆమెకు బ్రాండెడ్ దుస్తులు, అలాగే ఖరీదైన నగలు కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడట. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తే ఖర్చులు అకాశాన్ని తాకేస్తాయని, సంపాదించిన దాంట్లో సగం ఎంజాయ్ చేయడానికే ఉపయోగిస్తారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply